Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లికి వివాహం చేయలేక అన్న ఆత్మహత్య ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (12:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. చెల్లెలు పెళ్ళి చేసేందుకు డబ్బులు లేక అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... జిల్లాలోని చందుర్తి మండలం, ఎనుగల్ గ్రామానికి చెందిన గసికంటి శంకరయ్య, సత్తవ్వ కుమారుడు ప్రమోద్ (25)తో పాటు ఓ కుమార్తె ఉంది. మూడేళ్ళ క్రితం ప్రమోద్ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్ళాడు. అక్కడి పరిస్థితులు తట్టుకుని పని చేయలేక, చేసిన పనికి జీతం ఇవ్వకపోవడంతో యేడాది తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామంలో పత్తిలోడుకు వెళ్లి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయానికి విగతజీవిగా పడివున్నాడు. ఇంట్లోనే ఉరికంభానికి వేలాడుతుండటాన్ని గమనించిన సత్తవ్వ.. బోరున విలపిస్తూ కేకలు పెట్టింది. ప్రమోద్ ఆత్మహత్యకు సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. 
 
"నా ఆత్మహత్యు ఎవరూ కారణం కాదు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నాను. చెల్లిని బాగా చూసుకోవాలి" అని అందులో రాసిపెట్టాడు. తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రమోద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం.. చెల్లికి పెళ్ళి చేసేందుకు డబ్బులు లేవని బాధపడేవాడని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకుని వుంటాడని'' వాపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments