Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా పాటకు వధువు డ్యాన్స్.. వరుడు ఫిదా

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:31 IST)
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా’ అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందింది. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు.. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.
 
అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది.  ఈ పాట ఎక్క‌డ‌కి వెళ్లినా బుల్లెట్ బండి పాట వినిపిస్తోంది. ప్యాసింజ‌ర్ ఆటోల నుంచి టీస్టాల్, దాబా ఇలా ఎక్క‌డైనా ఆ పాట‌నే హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 
 
ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. తాజాగా ఓ వధువు తన పెళ్లి త‌ర్వాత జ‌రిగిన‌ బరాత్‌లో ఆ పాట‌కు ల‌య బ‌ద్దంగా కాలు క‌దుపుతూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. 
 
వ‌ధువు స్టెప్పుల‌కు ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు. అయితే వ‌ధువు ఏదో ఒక్క స్టెప్పు వేసి ఊరుకోలేదు.. పాట పూర్తిగా అయిపోయేవ‌ర‌కు త‌న నృత్యంతో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రశ్మిక మందన్న

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments