Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 68 వేలమందికి కోవిడ్ పరీక్షలు - 1433 మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 68,041 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇందులో 1,433 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 16 కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడగా... 1,815 మంది కోలుకున్నారు. ఈ లెక్కలతో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 19,97,102కి చేరుకుంది. మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. 13,686 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
మరోవైపు, కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ ‌కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. 
 
కాగా, మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,45,457కు, మొత్తం మరణాల సంఖ్య 19,049కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 18,731 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 35,48,196కు చేరుకున్నదని పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో టెస్ట్‌ పాజిటివిటీ రేటు 15.5 శాతంగా ఉన్నది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments