తెల్లారితే పెళ్లి.. వధువు ఆత్మహత్య.. పెళ్లికి తర్వాత ఉద్యోగం చెయ్యాలన్నాడు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (11:00 IST)
తెల్లారితే పెళ్లి జరుగుతుందనగా.. వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవళి (22) తెలంగాణలోని నవీపేటకు చెందినది. రెండు కుటుంబాల అంగీకారంతో అథీ ప్రాంతానికి చెందిన సంతోష్ తో ఆమెకు వివాహం  జరగాల్సి వుంది. దీని కోసం, పెళ్లికి ముందు రోజు మెహందీ వేడుకను నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి  ఇరు కుటుంబాల బంధువులు కూడా హాజరయ్యారు. ఉదయం పెళ్లి జరుగనుండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో పెళ్లికొడుకు సంతోష్ వధువు రవళితో మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
పెళ్లికి తర్వాత కూడా ఉద్యోగం చెయ్యాలని.. పెళ్లి తర్వాత ఆస్తిని పంచుకోవాలని వధువుతో అన్నాడు. ఈ వ్యవహారంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వధువు రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వరుడి కుటుంబంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్

Akira Nandan: అకీరా నందన్ ఫస్ట్ మూవీ ఎవరితో తెలుసా?

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

నటి ప్రత్యూషను 10 మందితో గ్యాంగ్ రేప్ చేయించి చంపేసాడు, కుక్కచావు చస్తాడు: తల్లి ఆవేదన

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments