నిజామాబాద్‌లో కవితను పీకేశారు... రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (20:05 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నో మాటలు చెప్తారని  కానీ ఒక్కమాట మీద కూడా నిలబడరని విమర్శించారు. 
 
టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుకొచ్చారని కానీ చేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఒక్కరికైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. 
 
దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు రాజాసింగ్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన  కేసీఆర్ సీఎం అయిన తర్వాత కొడుకుకి ఒక జాబు, అల్లుడుకి ఒక జాబు, కూతురుకి ఒక జాబు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అయితే ఇటీవలే నిజామాబాద్ లో ఆ ఉద్యోగాన్ని ప్రజలు పీకేశారని చెప్పుకొచ్చారు.

స్టీరింగ్ పీకేసి అక్కా ఆడుకో అంటూ ఇచ్చేశారని కవిత ఓటమిపై పరోక్షంగా సెటైర్లు వేశారు రాజాసింగ్. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. రూ.2లక్షల 34వేల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని రాజాసింగ్ ఆరోపించారు. 
 
ఆ అప్పు చేసి ఎక్కడ పెట్టావని ప్రశ్నిస్తుంటే జవాబు లేదు, కితాబు లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పు ఆయన కుటుంబంపై లేదని, ఆయనపైనా లేదన్నారు. తెలంగాణ ప్రజలనెత్తిపై ఉందని చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని దేవరకొండ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను మరలా వస్తానని దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని రాజాసింగ్ ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments