Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలదించుకునేలా పోలీస్‌ల తీరు... తెలంగాణ పోలీసులపై విజయశాంతి మండిపాటు

Advertiesment
తలదించుకునేలా పోలీస్‌ల తీరు... తెలంగాణ పోలీసులపై విజయశాంతి మండిపాటు
, శుక్రవారం, 2 ఆగస్టు 2019 (08:11 IST)
ఆయుర్వేద వైద్య విద్యార్థుల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ లపై తక్షణం చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి డిమాండ్ చేశారు.. విద్యార్ధినుల  పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.. 
 
"ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా విద్యార్థుల పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా.. అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉంది. ఈ ఘటనను చూసిన తర్వాత మహిళల విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ టిఆర్ఎస్ అధినాయకత్వానికి టిఆర్ఎస్ పాలకులకు ఎంత చులకన భావం మరోసారి అర్థమవుతోంది.

ఓ అనామక సంస్థకు టెండర్లు అప్పగించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదు అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖకు చెందిన మహిళ ఉద్యోగిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా… కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంది.

ఇప్పుడు ఆయుర్వేద కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ టిఆర్ఎస్ పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదు. మహిళల భద్రత కోసం షి టీంలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్… మహిళ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

ప్రతిపక్షాలు చేసే విమర్శలను… వారి వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఈ విషయంలో లో మేము చేసే డిమాండ్ ని పట్టించుకోకపోతే… మహిళల నుంచి వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూడాల్సి ఉంటుంది" అని విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టింగ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నం-విశాఖపట్నం.. అట్టహాసంగా ఇంద్ర ఎ. సి బస్సు సర్వీసు ప్రారంభం