Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు - పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:52 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతూ రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీన్ని చూసిన ముస్లిం ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో రాజాసింగ్ ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి, ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన్ను షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్ వీడియోపై ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీస్ స్టేషన్‌ల ఎదుట ముస్లింలు ఆందోళనకు దిగారు. 
 
ముఖ్యంగా, బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, హిందువులు, ముస్లింల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments