Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కోసం నాలుక పీకుతోంది, తాళం పగులగొట్టి బీర్ సీసాలతో పరార్...

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:48 IST)
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి యేదేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బార్లు, వైన్ షాపులను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ దాన్ని తొలగించి అక్రమంగా మద్యం తరలిస్తూ ఇప్పటికే నగర శివార్లలో చాలా చోట్ల పలువురు పట్టుబడ్డారు. తాజాగా ఉప్పల్ బస్సు డిపో వద్ద గల వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్లో కొందరు వ్యక్తులు ఎక్సైజ్ ఆధికారులు సీజ్ చేసిన తాళాలు పగులగొట్టి అందులో ఉన్న బీరు బాటిల్స్ తీసుకొని వెళ్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
 
మరికొందరు మద్యం బాటిల్స్‌తో పరారైనట్లు వారు తెలిపారు. ఇదే తరహాలో ఘట్కేసర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో గత కొద్దిరోజులుగా భారీగా మద్యం పట్టుబడుతోంది. వైన్ షాపులు, బార్ల నుండి బయటకు తీసుకువచ్చి రహస్య ప్రాంతాలలో మద్యంను దాచి ఉంచి హైదరాబాదుతో పాటు నగర శివార్లకి మద్యం తరలించి అమ్ముతూ, అక్రమా దందాకు తెర లేపారు కొందరు బార్, వైన్స్ షాపు యాజమానులు. 
 
వైన్స్ షాపుల్లో తక్కువ ధర వెయ్యికే దొరికే మద్యం సుమారు నాలుగు నుండి అయిదు వేల వరకు విక్రయిస్తున్నారు. లాక్ డౌన్ కర్ప్యూ సందర్భంలో రోడ్డుపై రావాలంటే సామాన్య ప్రజలు జంకుతుంటే, ఇలాంటి మద్యం అక్రమా దందాకు పాల్పడుతున్న వారు మాత్రం ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ మద్యం రవాణ జరుపుతున్నారు. వీరికి పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లే కనిపిస్తుందని పలువురు స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments