Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా తెరాస ఎంపీ కుమార్తె!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:47 IST)
హైదరాబాద్ నగర మేయర్ అభ్యర్థిగా తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. అలాగే, ఈమెతో పాటు.. మరో మహిళా నేత మోతె శ్రీలత పేరు కూడా ఉంది. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్ల సమావేశం గురువారం జరుగనుంది. అలాగే, ఈరోజు మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగనుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి పోటీపడే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించి సీల్డ్ కవర్‌లో దానిని మంత్రులకు అందించారు. 
 
కేసీఆర్ ఎంపిక చేసిన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి, మోతె శ్రీలత ఉన్నట్టు సమాచారం. విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా, శ్రీలతను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి మాత్రం ఆమెకు పక్కా అని చెబుతున్నారు. శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
 
మరోవైపు, ఇప్పటికే మంత్రులు తలసాని, మహ్మద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్‌ సహా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments