కేఏ పాల్‌పై దాడి: పాల్‌పై చెంపదెబ్బ..

Webdunia
సోమవారం, 2 మే 2022 (19:44 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. 
 
డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు. పాల్‌ చెంపపై కొట్టాడు. ఇక, వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు అతడిని అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల ఎదుటే టీఆర్ఎస్‌ శ్రేణులు నాపై దాడి చేశారని మండిపడ్డారు కేఏ పాల్.. పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక టీఆర్ఎస్‌ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments