Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్.. ఇద్దరూ ఒక్కరే: రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (14:19 IST)
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు వుంటే.. ఆపద్ధర్మ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఆదాయం మాత్రం నాలుగు వందల రెట్లు పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ఎన్ని ఇచ్చాడో ఆలోచించాలని... కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని రాహుల్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తీరుతాయని ప్రజలు భావించారు. 
 
కానీ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి యువకుడు నిరాశ, అసంతృప్తితో ఉన్నాడని.. రాహుల్ గాంధీ తెలిపారు. కొడంగల్‌‌లో తనకు కాంగ్రెస్ గెలుపు కనిపిస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. కేసీఆర్‌ను ఖండించడం ఖాయమని తెలుస్తోందని చెప్పారు. రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ.. ప్రస్తుతం రెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. 
 
ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇద్దరూ ఒక్కరేనని మోదీకి అవసరమైనప్పుడు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌ అని ఎద్దేవా చేశారు. మోదీ.. మైనార్టీ, దళిత, గిరిజన వ్యతిరేకి అని రాహుల్‌ అన్నారు. అలాంటి మోదీని సమర్థించే కేసీఆర్‌ను ఏమనాలని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments