Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా కల్లోలం - కేరళ నుంచి నర్సులు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (16:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులకో కిటకిటలాడిపోతున్నాయి. మరోవైపు, సుశిక్షితులైన నర్సులకు కూడా కొరత ఏర్పడింది. దాంతో హైదరాబాదులోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు కేరళ నుంచి హుటాహుటీన 50 మంది నర్సులను చార్టర్డ్ విమానాల్లో తీసుకువచ్చాయి. 
 
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నర్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. వారికి అధిక వేతనాలను ఇచ్చేందుకు కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి. దీనిపై తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా నర్సులకు ఇచ్చే జీతానికి ఇది మూడు రెట్లు ఎక్కువని అన్నారు. నర్సులు కావాలంటూ తమకు రోజుకు 10 నుంచి 15 కాల్స్ వరకు వస్తున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments