Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ నడపడంలో పోటీపడుతున్న అన్నా చెల్లి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:52 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్. షర్మిళలు ఇపుడు ట్రాక్టర్లు నడపడంలో పోటీ పడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపారు. ఇపుడు ఆయన చెల్లి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ కూడా ట్రాక్టర్ నడిపారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ఆమె ట్రాక్టర్ నడిపి అభిమానులను, రైతులను ఆనందపరిచారు. ఇపుడు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments