Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (13:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటిపూట ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటే సాయంత్రానికి వర్షం పడుతుంది. దీంతో తెలంగాణ వాసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. 
 
బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇందుకు కారణం వాతావరణంలో నెలకొన్న అనిశ్చితితో పాటు ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, పాలమూరు, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు అందివచ్చిన పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 
 
అందువల్ల ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం జలమయమైన విషయం తెల్సిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments