Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో స్కీములన్నీ స్కాములేన్నీ.. భట్టి విక్రమార్క

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:29 IST)
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన స్కీములన్నీ స్కాములేన్నీ కాంగ్రెస్ ఆరేళ్లుగా చెబుతున్న మాటను బీజేపీ ఇప్పుడు వల్లిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని టీఅర్ఎస్ కు తోక పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మొదట నుంచి సహకరిస్తుంది టీఆర్ఎస్ అని భట్టి చెప్పారు. ఈ మధ్యకాలంలో పార్లమెంట్ లో జరిగినా పలు బిల్లుల వోటింగ్ లో టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వ్యహరించించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2014 ఎన్నికల నుంచి టిఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని భట్టి విక్రమార్క చెప్పారు.  కేంద్రంలో బీజేపీకి ఎప్పుడు అవసరమైనా టిఆర్ఎస్ మద్దతు ఇస్తోందని అన్నారు. 
 
కేసీఆర్ స్కీములన్నీ స్కాములని లక్ష్మణ్ ఇప్పుడు అంటున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లుగా వీటిపై పోరాటం చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. రీ డిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద స్కామని భట్టి అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి పంప్ చేసిన నీటికంటే ఎక్కువ జలాలను కిందికి వదిలేశారు. దీనివల్ల ఖజానాకు లాభమా నష్టమా అని భట్టి ప్రశ్నించారు. 
 
లక్ష కోట్ల కాళేశ్వరంకు ఒక సూత్రదారుని ద్వారా టెండర్లు వేసి పనులు చేపించారని భట్టి చెప్పారు. 55 వేల కోట్ల మిషన్ భగీరథ టెండర్లు కూడా అలానే జరిగాయని భట్టి అన్నారు.   సీతారామ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా  పెద్ద స్కాముగా భట్టి అభివర్ణించారు. రీ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుల పైన బీజేపీ విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 
 
తెలంగాణలో ప్రాజెక్టులలో జరిగిన అవినీతి, ప్రాజెక్టు రీ డిజైనింగ్ వల్ల పెరిగిన అంచనాలు ఇలా అన్నింటిపైన కేంద్ర దర్యాప్తు  సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ నేను కూడా కేంద్ర హోమ్ మంత్రిని కలిసి కొరతానని భట్టి ప్రకటించారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం వీటి మీద విచారణ జరిపించేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని చెప్పారు. 

రాష్ట్ర నిధులను ఒక కుటుంబం దోపిడీ చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతీ టెండర్లో ఎల్1, ఎల్2, ఎల్3లే పాల్గొన్నాయి. వాటికే పనులు దక్కాయి. ఒకే ఆఫీస్ లో కూర్చొని టెండర్లు డిసైడ్ చేసినట్లుగా ఉంది.

ఏ పార్టీలో, ఎక్కడా అవకాశం లేని నాయకులనే బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంటోందని అన్నారు. క్షేత్రస్థాయిలో పట్టు లేకనే ఇతర పార్టీల నేతలను బీజేపీ చేర్చుకుంటోందని భట్టి విక్రమార్క అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments