Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన.. జేపీ నడ్డా

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:23 IST)
తెలంగాణలాంటి పుణ్యభూమిపై తాను అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన తెలంగాణ గడ్డలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. 
 
తెలుగులో తన ప్రసంగాన్ని మెుదలుపెట్టగిన జేపీ నడ్డా సభకు హాజరైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం మన పార్టీకి ఎల్లప్పుడు ఉంటుందని తనకు విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఖాళీలు భర్తీ చేయాలని నిలదీస్తే తెలంగాణ ద్రోహులు అంటూ తమపై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన 30 మంది కీలక నేతలకు కాషాయికండువా కప్పారు. దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించే సత్తా ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 
 
మోదీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే అనేక మంది నేతలు అనేక పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. 
 
బీజేపీ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదన్నారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవన్నారు. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కూతురు ఇలాంటి కుటుంబ పాలన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలా ప్రజలను ఓటు బ్యాంక్ గా చూడబోదన్నారు. 
 
ఒకే దేశం-ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం అనే పేరుతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్ష అయిన జమ్ముకశ్మీర్ విభజన చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించదన్నారు.   
 
సభలో కన్నీరు పెట్టుకున్నగరికపాటి
పదవుల కోసం కాకుండా పార్టీ గెలుపు కోసం బీజేపీలో చేరుతున్నామన్నారు ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు. టీడీపీలో నష్టపోయిన నేతలకు బీజేపీలో న్యాయం చేస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన  బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గరికపాటి భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి పనిచేశామని.. కష్టకాలంలో పార్టీ చాలా ఆదుకుందన్నారు. తెలంగాణ టీడీపీలో పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వలేదన్నారు. టీడీపీకి బలం ఉన్నా పోటీకి నిలబెట్టలేదన్నారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి చాలా సార్లు చంద్రబాబుకు చెప్పిన ఆయన పట్టించుకోలేదన్నారు. అసలు పార్టీని తెలంగాణలో ఉంచాలా? తీసేయాలా? అనే పరిస్థితి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments