Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేందుకు నారా లోకేశ్ ఆర్మీ కుట్ర : పోలీసులకు ఆర్కే ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (17:06 IST)
తనను చంపేందుకు నారా లోకేశ్ ఆర్మీ కుట్ర పన్నుతోందని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్. రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక తాడేపల్లిలోని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ఆయన చేసిన ఫిర్యాదులో "నాని చౌదరి, లోకేశ్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నన్ను బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు జగన్‌ను జైలుకు పంపుతామనీ, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. తెదేపా శ్రేణుల నుంచి తనకు ప్రాణహానీ ఉందనీ, తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆర్కే కోరారు. 
 
అంతేకాకుండా, కరకట్ట ప్రాంతం కూడా తన నియోజకవర్గంలో భాగమని, అందుకే తాను అక్కడ పర్యటించానని చెప్పారు. అంతేగానీ, తాను టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ ఇప్పటికీ ఓర్వలేక పోతున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments