Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తంకు జైకొట్టిన రాములమ్మ... ఖర్జే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (18:14 IST)
సినీ నటి విజయశాంతి భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేసి హస్తానికి జైకొట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరినట్టయింది. శుక్రవారం హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
 
ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. కిషన్‌ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. 
 
తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆమె మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం గమనార్హం. 
 
కాగా, తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఆమె తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత తెరాసలో చేరి మెదక్ ఎంపీగా గెలుపొందారు. పిమ్మట ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇపుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments