Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎంకి బ్యాలెట్ బాక్సులో కింగ్ ఫిషర్ బీర్ కోసం లేఖ...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:29 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ వెరైటీ విన్నపం అందింది. అది కూడా నేరుగా కేసీఆర్‌కు పంపకుండా బ్యాలెట్ బాక్స్‌లో వేయడం విశేషం. కేసీఆర్‌కు డైరెక్ట్‌గా తన కోరికను విన్నవించుకోవడం కష్టం అనుకున్న ఆ వ్యక్తి ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను తన విజ్ఞప్తిగా వేదికగా చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచిన అధికారులకు జగిత్యాల జిల్లా వాసుల పేరుతో ఓ లేఖ దొరికింది. 
 
ఆ లేఖ వ్రాసిన అజ్ఞాత వ్యక్తి తమ జిల్లాలో కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ బ్రాండ్‌ బీరు కోసం పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నాడు. తమ మీద దయతలిచి కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులో ఉంచాలని కోరాడు. అంతేకాకుండా తన లేఖ చివరలో నోట్‌ అంటూ ప్రత్యేకంగా పెట్టి, కింగ్‌ ఫిషర్‌ బీర్ల కోసం జిగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయాలనే సూచన కూడా చేశాడు ఆ వ్యక్తి. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments