Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో యువకుడి హత్య... పరువు హత్యేనా? మాటువేసి తల్వార్‌తో నరికేశాడు...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి హతమార్చ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (18:32 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి హతమార్చాడు. మృతి చెందిన యువకుడు పట్టణంలోని వినోభానగర్‌కు చెందిన పెరుమళ్ళ ప్రణయ్ కుమార్‌గా గుర్తించారు. 
 
మృతుడు ప్రణయ్ గత ఆరు నెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా చేసాడు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పొలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది. 
 
కాగా ఈ రోజు ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పటల్‌లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
 
హత్య చేసిన నిందితుడి కోసం 8 బృందాలు వెతుకుతున్నాయి. బీటెక్ చదివిన పెరుమల్ల ప్రణయ్ 
తండ్రి పెరుమళ్ల బాలస్వామి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ హత్యపై జిల్లా ఎస్పీ రంగనాధ్ విచారణను వేగవంతం చేశారు. హతుడు ప్రణయ్‌ది పరువు హత్యగానే అనుమానిస్తున్నట్లు చెప్పారు. గతంలో అతడికి ప్రాణ హాని ఉందని అతడి తలిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ క్రమంలో యువతి తండ్రి మారుతిరావును కూడా హెచ్చరించినట్లు పేర్కొన్నారు. 
 
ప్రణయ్‌కు ఎలాంటి హాని చేయమని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మొన్నటిదాకా కూతురు, అల్లుడితో సఖ్యతగా ఉంటే వివాదం సద్దుమణిగిందనుకున్నామని చెప్పారు. కాగా ఈ హత్యకు అమ్మాయి తండ్రే సూత్రధారి అని ఇంకా నిర్థారణ కాలేదనీ, ప్రణయ్ హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments