వేట కత్తితో రెండు వేట్లేసి నరికి చంపేశాడు...: కుమార్తెను ప్రేమించి పెళ్లాడాడనీ...

అంతా అటుఇటూ తిరుగుతూ వుండగానే... జనం అంతా చూస్తుండగానే వెనగ్గా వెళ్లి వేట కత్తితో రెండు వేట్లేసి దారుణంగా హతమార్చాడు ఓ దుండగుడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి ఆసుప

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:54 IST)
అంతా అటుఇటూ తిరుగుతూ వుండగానే... జనం అంతా చూస్తుండగానే వెనగ్గా వెళ్లి వేట కత్తితో రెండు వేట్లేసి దారుణంగా హతమార్చాడు ఓ దుండగుడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రికి సమీపంలో పెరుమళ్ళ ప్రణయ్ అనే యువకుడుని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు.
 
వివరాల్లోకి వెళితే... ప్రణయ్ గత ఆరు నెలల క్రితం మిర్యాలగూడకు చెందిన అమృతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అమృత మిర్యాలగూడలోని ఓ ధనవంతుని బిల్డర్ కుమార్తె. ప్రేమ వివాహం సమయంలో ప్రణయ్ తరపువారికి అమృత తరపువారికి పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. 
 
ఐతే స్థానికి డిఎస్పి సమక్షంలో వివాదం పరిష్కారం అయింది. కానీ ఈ హత్య చూస్తుంటే ఆ వివాదం పరిష్కారమైనట్లు కనబడటంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరువు హత్యేమోనన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తాత చంద్రబాబును ప్రశ్నించిన మనవడు దేవాన్ష్.. సమర్థించిన లోకేష్‌, బ్రహ్మిణి?