బాలుడిని చంపేసిన సపోటా గింజ... ఎలా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:22 IST)
ఆమధ్య తమిళనాడులో సమోసా గొంతులో ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూరులో చోటుచేసుకుంది. సపోటా పండు తింటున్న బాలుడు నోట్లో సపోటా గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మల్లాపురుకి చెందిన లింగా గౌడ్, సుజాతలకు ఇద్దరు కుమారులు. గౌడ్ సౌదీలో పనిచేస్తుండగా అతడి భార్య సుజాత బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇక్కడే వుంటోంది. సోమవారం నాడు తన విధులు ముగించుకుని వస్తూవస్తూ దారిలో తాజా సపోటా పండ్లు కనబడటంతో వాటిని కొనుగోలు చేసి తీసుకు వచ్చింది. 
 
సపోటా పండ్లతో ఆమ్మ కనబడగానే ఆమె వద్ద నుంచి ఓ సపోటా పండు తీసుకుని నాలుగేళ్ల పిల్లాడు తినేశాడు. ఐతే తింటున్న సమయంలో సపోటా పండు గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments