Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు ప్రాణగండం అంటూ వివాహిత మెడలో తాళి కట్టిన నకిలీ జ్యోతిష్యుడు

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (12:34 IST)
మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని నకిలీ జ్యోతిష్యులు, స్వామిజీలు ప్రజల జీవితాలతో ఆడలాడుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. తాజాగా ఇటువంటి ఘటన హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో జరిగింది.
 
కోసూరి మాధవ్ అనే వ్య‌క్తి తాను జ్యోతిష్యుడిని అంటూ ఓ వివాహితకు పరిచయమయ్యాడు. జాతకంలో దోషం ఉంద‌ని, దాని వ‌ల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణపాయం ఉందని నమ్మించాడు. దోషనివారణకు పూజలు చేస్తే  సరిపోతుందని నమ్మించాడు. పూజా సమయంలో భర్త ఉండకూడదు అని మాయమాటలు చెప్పి పూజ పేరుతో ఆ వివాహిత మెడలో తాళి కట్టాడు.
 
తాళి కట్టాక నువ్వు నా భార్యవంటూ డబ్బుల కోసం బెదిరించి, అసభ్యకరమైన ఫోటోలు మెసేజ్ బాధితురాలి ఫోన్‌కి పంపించాడు. దీంతో బాధితురాలు కె.పి.హెచ్.బి. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ నకిలీ జ్యోతిష్యుడు నుంచి రక్షించాలంటూ వేడుకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోసూరి మాధవ్‌ను, అతడి స్నేహితుడు రాఘవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments