Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:20 IST)
టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రసూల్ పురలో కడుపు నొప్పితో ఓ యువతి బ్రైట్ హోమియో క్లినిక్‌కు వచ్చింది. కడుపు నొప్పి విపరీతం కాగా.. బాత్రూంకు వెళ్ళాలని కోరడంతో.. క్లినిక్‌లో బాత్రూం లేదని ఎదురుగా ఉన్న వారి ఇంటికి పంపించారు.
 
బాత్రూం నుంచి తీవ్ర రక్తస్రావంతో బయటకి రాగా.. పుట్టిన పాప సింక్‌లో పడిపోయిందని ఆ ఇంటివారికి తెలిపింది. దీంతో ఆ ఇంటివారు వెంటనే బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే పసిగుడ్డు కన్నుమూయగా, అవివాహిత కావడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పాప మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అబార్షన్ కోసమే వైద్యురాలి దగ్గరకు వచ్చిందని.. ఆమె ఇచ్చిన మెడిసిన్‌తోనే ఇలా జరిగి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బేగంపేట పోలీసుల మాత్రం విషయం బయటకు రాకుండా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
వైద్యురాలు మాత్రం ఆసుపత్రి మూసి అందుబాటులో లేకుండా పోయారు. పధకం ప్రకారం వాష్ బేషన్‌లో వేసి పాపను చంపిందా లేక పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments