కేసీఆర్ కీలక నిర్ణయాలు.. తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు ఐదు కేజీల బియ్యం

Webdunia
సోమవారం, 10 మే 2021 (12:55 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలలపాటు ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 
 
అదేవిధంగా ప్రైవేటు టీచ‌ర్ల‌కు అందించే సాయాన్ని మ‌రో 80 వేల మందికి అందించ‌నున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కూడా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వేగంగా చర్యలు తీసుకోవలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
ముఖ్యంగా వైద్య సిబ్బందిపై భారం తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా వల్ల దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
అలాగే రాష్ట్రంలో 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారున్నారని.. ఆసక్తి ఉన్నవారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments