Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. ఆమె కడుపులో 20 రాళ్ళు.. ఒక్కో రాయి సైజు 20మి.మి

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (17:19 IST)
Kidney
కిడ్నీలో రాళ్లు రావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఆహారప అలవాట్లు మారడం.. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ సీన్ వేరేలా వుంది. ఓ మహిళ గాల్‌బ్లాడర్‌లో ఏకంగా 20 వరకు రాళ్లు.. అవి కూడా 20మి.మీ. ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. నస్రీన్‌ అనే యువతి రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు. 
 
చివరకు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్‌ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు.

ఈ మేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్‌ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20 రాళ్లు, ఒక్కో రాయి సైజు 20 మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments