Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాస‌న‌స‌భ సోమ‌వారానికి వాయిదా

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (17:18 IST)
హైద‌రాబాద్: తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ఈ నెల 22వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. బ‌డ్జెట్‌పై చ‌ర్చ ముగిసిన అనంత‌రం స‌భ‌ను సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు.
 
ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం, ఎల‌క్ర్టానిక్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌, మైనార్టీల‌కు రుణ ప‌థ‌కం, న‌ర్సంపేట్ – కొత్త‌గూడ రోడ్డు, టీఎస్ బీపాస్, బీపీఎల్ కుటుంబాల‌కు రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయా శాఖ‌ల మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం జీరో అవ‌ర్ చేప‌ట్టారు.
 
జీరో అవ‌ర్ ముగిసిన అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌ను స్పీక‌ర్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ మోజ‌మ్‌ఖాన్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు మాట్లాడారు. అనంత‌రం స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments