Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చికుక్క‌ల‌ స్వైర‌విహారం, 10 మందికి తీవ్ర‌గాయాలు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:36 IST)
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పిచ్చికుక్క‌లు స్వైర‌విహారం చేశాయి. ఈ పిచ్చి కుక్కల దాడిలో 10 మందికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. ఒక‌రి క‌నుగుడ్డు తొలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చుంచుప‌ల్లి మండ‌లం సింగ‌రేణి కార్మిక‌ ప్రాంత‌మైన‌ రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్క‌ల‌ స్వైర‌ విహారంతో జ‌నం భ‌య‌కంపితుల‌య్యారు. 
 
దొరికిన‌ వారిని దొరికిన‌ట్లు దాడి చేశాయి. కండ‌ల‌ను కొరికాయి. వీర‌స్వామి అనే వ్య‌క్తి క‌నుగుడ్డు పీక‌టంతో యంజియంకు త‌ర‌లించారు. మిగ‌తావారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. పిచ్చి కుక్క‌ల‌ స్వైర‌విహారంతో స్థానికులు హ‌డ‌లిపోయారు. స్థానికులు వెంబ‌డించి జ‌నంపై దాడి చేసిన‌ కుక్క‌ను చంపేసారు.
 
కుక్క‌ల స‌మ‌స్య‌ తీవ్రంగా ఉన్న‌ద‌ని, సింగ‌రేణి అధికారుల‌ ద‌ృష్టికి తీసుకెళ్ళినా స్పందించ‌లేద‌ని స‌ర్పంచ్ రామ‌స్వామి తెలిపారు. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కుక్క‌ల‌ బీభ‌త్సానికి జ‌నం భీతిల్లిపోయారు. అధికారులు స్పందించి బాధితులకు మెరుగైన‌ వైద్యం అందించాల‌ని స‌ర్పంచ్ రామ‌స్వామి కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments