ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై సుంకర పద్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను అవమానించే వారికి చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా, జగన్‌ను మహిళలు చెప్పులతో కొడతారన్నారు. అలాగే, అంబటి రాంబాబును ఓ పిచ్చికుక్కతో ఆమె పోల్చారు.
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ, తుళ్లూరులో రైతులు చేస్తున్న మహాధర్నాకు ఆమె సంఘీభావం తెలిపి, ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజధాని రైతులను అరెస్టు చేయటానికి జగన్మోహన్ రెడ్డిలా వారేమైనా జైలుకు వెళ్లారా..? అని ప్రశ్నించారు.
ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అంబటి రాంబాబు పేర్కొనటంపై అదో పిచ్చికుక్క అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు డీజీపీ చెంచాగిరి చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు..
అంతేకాకుండా, 'జగన్ నువ్వు ఒక తల్లికి కొడుకువు అయితే, ఒక చెల్లికి అన్నవు అయితే, ఒక భార్యకు భర్తవు అయితే ఇందరు మహిళలకు కన్నీళ్లు పెట్టించవన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని చదువుతూ.. మహిళలకు డబ్బులు ఎక్కువై ఏమి చేసుకోవాలో అర్థం కాక గ్రూపులుగా ఏర్పడి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంట.. మన పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేసి మూయించారు కాబట్టి పోరాటంలో మహిళలకు ఎక్కువగా ఉన్నారని వారి సోషల్ మీడియాలో ఈ పెద్దమనిషి (జగన్) పోస్టింగ్‌లు పెట్టించారని సుంకర పద్మ శ్రీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్‌లను తన సెల్‌ఫోన్‌లో చూపి వినిపించింది.
వీరిని ఏం చేయాలి? చెప్పుతో కొడదామా.. అని ఆమె కాలు చెప్పు తీసింది. మహిళలపై ఇటువంటి పోస్టింగ్‌లు పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్పుదెబ్బలు తినాల్సి ఉంటుందని హెచ్చరించింది. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బ్యూటీ పార్లల్లో ఉన్నారని ఇక్కడ మహిళలు కేసు పెట్టారన్నారు. కేసులు పెట్టుకుంటారా.. పెట్టుకోండి భయపడేది లేదని సుంక పద్మశ్రీ అన్నారు.