Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 1200 ప్రభుత్వ వైద్య సీట్లు

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసింది. దీనికి కారణం ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టింది. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. 
 
ఈ 8 కొత్త వైద్య కాలేజీల్లో జగిత్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఎన్‌ఎంసి ఇప్పటికే అనుమతి ఇవ్వగా, మహబూబాబాద్, మంచిర్యాలు, కొత్తగూడెం, రామగుండంలో మిగిలిన నాలుగింటికి మరికొన్ని వారాల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇపుడు కొత్తగా మరో 1200 వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లో మరో 3500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఎనిమిది వైద్య కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని రూ.1479 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం