Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసి భర్తపై భార్య హత్య యత్నం: ప్రాణాల కోసం పోరాడిన భర్త మృతి

ఐవీఆర్
శనివారం, 1 మార్చి 2025 (10:59 IST)
వరంగల్ సిటీలో వైద్యుడైన భర్తపై భార్య తన ప్రియుడుతో కలిసి హత్యాయత్నం ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఫిబ్రవరి 20న జరుగగా దాడిలో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వరంగల్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించి ఈరోజు శనివారం అతడు తుదిశ్వాస విడిచాడు.
 
ప్రేమించి పెళ్లి చేసుకుంది... కానీ రెండోసారి రెండో వ్యక్తిపై మళ్లీ ప్రేమ
వారిద్దరూ ఏడెళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే ఏడేళ్ల జీవితంలో వారిద్దరి మధ్య వున్న ప్రేమ మసకబారిపోయింది. ముఖ్యంగా భార్యగా మారిన ప్రియురాలు చూపు మరో వ్యక్తిపైన ప్రేమ మొగ్గ తొడిగింది. ఫలితం వివాహేతర సంబంధం. భర్తగా మారిన పాత ప్రియుడు పాతబడి పోయాడో లేదంటే కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడో కానీ ఆమె మరో వ్యక్తి బంధంలో చిక్కుకునిపోయింది. ఇక ఆ తర్వాత ఏడేళ్లక్రితం పెళ్లాడిన పాత ప్రియుడిని అంతమొందించేందుకు కొత్త ప్రియుడుతో కలిసి ప్రణాళిక రచించింది. కానీ అది బెడిసికొట్టడంతో వాస్తవం అంతా బైటకు వచ్చేసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వరంగల్ సిటీలో ఫిబ్రవరి 20న యువ వైద్యుడు గాదె సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. అతడిపై కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వాళ్లు చేసిన దాడిలో అతడు హతమయ్యాడు అనుకుని ఘటనా స్థలంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడి భార్య ఫ్లోరింజా తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడంటూ ఆందోళనపడింది. కానీ అది ప్రమాదం కాదు... ఓ పథకం ప్రకారం హత్య చేసేందుకు వేసిన పన్నాగం అని పోలీసులు తేల్చేసారు. ఈ ప్రణాళికలో స్వయంగా అతడి భార్య, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడు పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.
 
వివాహేతర సంబంధానికి బీజం జిమ్ సెంటర్
సుమంత్ ను పెళ్లాడిన ఫ్లోరింజా కాజీపేట మండలం ఫాతిమానగర్‌లో వుంటున్నారు. అక్కడే సుమంత్ రెడ్డి ఆస్పత్రి కూడా వుంది. దానికి సమీపంలో జిమ్ సెంటరు కూడా వుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అక్కడ వ్యాయామం చేసేందుకు ఫ్లోరింజ వెళ్తుండేది. అక్కడే ఆమెకి శామ్యూల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లయిన కొద్ది నెలలకే శామ్యూల్‌తో ఆమె తన బంధాన్ని కొనసాగించడం ప్రారంభించింది. విషయం భర్త సుమంత్‌కి తెలియడంతో తన మకాం కాజీపేటకు మార్చాడు.
 
స్థలం మార్చినా సంబంధాన్ని మాత్రం వదల్లేదు ఫ్లోరింజా. వీలు కుదిరినప్పుడల్లా శామ్యూల్‌తో కలిసి గడపడం చేస్తోంది. దీనితో సుమంత్-ఫ్లోరింజాల మధ్య తరచూ గొడవలు జరగుతున్నాయి. ఇక ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి శామ్యూల్‌తో పూర్తిస్థాయి గడపాలంటే భర్తను అడ్డు తొలగించడమే మార్గమని యోచించింది. ఆ ప్రకారం సుమంత్ పైన సంగారెడ్డి భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద దాడి చేసి అక్కడ నుంచి పారిపోయారు. ఐతే కొన ఊపిరితో వున్న సుమంత్ తనపై జరిగిన దాడి గురించి అన్ని వివరాలు తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యాయత్నం చేసి పారిపోయిన నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేసారు. వైద్యుడి భార్యను కూడా అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments