Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హలో... మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది: అత్తామామలకు అల్లుడు ఫోన్

Advertiesment
phone

ఐవీఆర్

, శనివారం, 1 మార్చి 2025 (10:38 IST)
నువ్వే నా లోకం అంటూ ఆమె వెంటపడీ మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి పెళ్లి పీటలెక్కారు. ఏడాది లోపుగానే వారికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ శనివారం నాడు... హలో, మీ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది అంటూ అత్తామామలకు అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. ఆ వార్త విని వారు హతాశులయ్యారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లికి చెందిన శివప్రియకు రూరల్ ప్రాంతానికి చెందిన నాగసాయి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి కులాలు వేరవడంతో తొలుత అమ్మాయి తరుపు వారు అభ్యంతరం చెప్పారు. కానీ తను ప్రేమించిన వాడితోనే వుంటానంటూ ఆమె అతడినే పెళ్లాడింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించారు ఆమె తల్లిదండ్రులు.
 
ఐతే ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హఠాత్తుగా నాగసాయి ఈరోజు ఫోన్ చేసి... మీ అమ్మాయి చనిపోయింది అని పిడుగులాంటి వార్త చెప్పాడు. ఈ వార్త అందుకున్న శివప్రియ తల్లిదండ్రులు... తమ కుమార్తెను ఆమె భర్త-అత్తమామలు వేధించి చంపేసారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తమకు తెలిసిందనీ, ఐతే చిన్నచిన్న వివాదాలే సర్దుకుంటాయిలే అనుకుంటే మా కుమార్తెను ఇలా పొట్టనపెట్టుకున్నారంటూ బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mukesh Ambani: సూపర్ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ- గౌతమ్ అంబానీ