రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (09:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులపై ఏసీబీ కొరఢా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రూ.లక్ష డిమాండ్ చేసిన ఈ ఎస్ఐ తొలుత రూ.20 వేలు తీసుకుని రూ.80 వేల నగదును లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పామూరు జిల్లా సర్కిల్ పరిధిలోని తెలగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్.పి.డి.సి.ఎల్) ఆపరేషన్స్‌లో భాగంగా, సూపరింటెండింగ్ ఇంజనీరుగా పని చేసే జనగాం నరేష్, ఒక ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేశారు. కురవి మరియు మరిపెడ సబ్ సడివిజన్లకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న అంగీకార పత్రాల ఒప్పందాలను యధాతథంగా కొనసాగించేందుకు అధికారికంగా సహకరించేందుకుగాను ఆయన మొత్తం రూ.లక్ష డిమాండ్ చేశారు. 
 
ఇందులోభాగంగా, ఇప్పటికే రూ.20 వేలు ముడుపులు స్వీకరించిన సురేష్ మిగిలిన రూ.80 వేలు బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నరేష్‌ను లంచం డబ్బులతో సహా అదుపులోకి తీసుకుంది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments