Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం!!

వరుణ్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (08:58 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఈ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్(20), జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమలకుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్(19) అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. 
 
శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments