Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర : అమెరికా రాయబారి

Eric Garcetti

వరుణ్

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (10:58 IST)
ప్రపంచ భవిష్యత్‌ను తీర్చిదిద్డంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. పైగా మీ భవిష్యత్‌మను చూసి ఆస్వాదించాలనుకుంటే అందుకోసం పని చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ వంటి దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు గర్వపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందన్నారు. 'మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. నేర్చుకోవడానికి వచ్చాం' అంటూ ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను నొక్కి చెప్పారు.
 
భారత్‌, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ అన్నారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని వైట్‌హౌస్‌ మీడియా సమావేశంలో తెలిపారు. అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడిపై అభియోగాలు రావడం.. ఇరు దేశాల మధ్య బంధంపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ సలివాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఈ కేసుపై దిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి మాట్లాడుతూ.. దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్ పండుగ.. పెరిగిన చికెన్ ధరలు..