పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

ఠాగూర్
గురువారం, 13 నవంబరు 2025 (11:21 IST)
ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండానికి చెందిన బూర సురేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నరేశ్ (32) హైదరాబాద్ నగరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం కాగా, నరేశ్‌కు గత నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 
 
అయితే, నరేశ్ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడనే కారణంతో అతనికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనేక సంబంధాలు చూసినప్పటికీ పెళ్లి మాత్రం కుదరలేదు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్... మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments