Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కుర్రోడికి జాక్‌పట్ - రూ.2 కోట్లతో అమెజాన్‌లో ఉద్యోగం

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (09:04 IST)
తెలంగాణ కుర్రోడుకి అదృష్టం వరించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో మంచి ఉద్యోగం అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది. పేరు అర్బాజ్ ఖురేషీ. సోమవారం నుంచి ఉద్యోగంలో చేరుతున్నారు. 
 
రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. విధుల్లో సోమవారం చేరనున్నారు. 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడో సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు. 
 
ఆ తర్వాత బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ రెండేళ్లు పనిచేశారు. 2023లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లలో ఎంఎస్ డిగ్రీ అందుకున్నారు. యువకుడి తండ్రి యాసిన్ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇక తన కుమారుడికి అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దొరకడం పట్ల తండ్రి యాసిన్ ఖురేషీ హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా టెక్సాస్ లో బాలక్రిష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ కు ఏర్పాట్లు

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ చిత్రం విడుదల 2 తెలుగు ట్రైలర్‌ విడుదల

జానీ మాస్టర్ పోస్ట్ కు చెక్ పెట్టిన శేఖర్ మాస్టర్- జోసెఫ్ ప్రకాశ్ విజయం

Manchu Manoj: మనోజ్ కాలికి గాయం.. ఆస్పత్రిలో చేరిక.. అసలేం జరుగుతోంది? (video)

Pushpa 2 Rs 500 crore: రూ. 500 కోట్ల మార్కును చేరిన పుష్ప-2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూర్యరశ్మితో 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

hemoglobin పెంచే టాప్ 6 ఉత్తమ ఆహారాలు

Boiled Moong Dal ఉడికించిన పెసలు తింటే?

కాఫీ, టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

రక్తంలో చక్కెరను తగ్గించే 5 సూపర్ ఫుడ్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments