Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rains Expected in Andhra Pradesh బంగాళాఖాతంలో అల్పపీడనం... 11 నుంచి విస్తారంగా వర్షాలు..

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (08:57 IST)
Rains Expected in Andhra Pradesh ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం అవరించి ఉండగా, ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు అనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 11వ తేదీన రాయలసీమలో విస్తారంగా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
కాగా, ఆదివారం కోస్తా, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
మరోవైపు,అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల్లో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరి కోతలు వాయిదా వేసుకునేలా అన్నదాతలను ఆప్రమత్తం చేయాలని ఆదివారం రాత్రి కలెక్టర్లు, జేసీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇప్పటికే రైతులు నూర్చిన ధాన్యాన్ని తక్ష ణమే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వరికుప్పలు, ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాల పంపి ణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు రైతులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments