Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రేషన్ కార్డు జారీకి మంత్రల ఉప సంఘం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:38 IST)
కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉంటారని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments