సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లును తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పలు సూచనలు చేసారు. మరోవైపు 2024 ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు గిరిజన జాతర జరుగుతుంది.
మూడవ రోజు భక్తులు వనదేవతలకు పూజలు చేసి, చివరి రోజు "తల్లుల వనప్రవేశం"తో జాతర ముగుస్తుంది. కుంకుమ పేటిక (సమ్మక్క) చిలకలగుట్టకు తిరిగి తీసుకుని వస్తారు. తదుపరి పండుగ వరకు అక్కడే ఉంచబడుతుంది. ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు మేడారం వద్ద ప్రార్థనలు చేస్తారు.