Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది... సీఎం రేవంత్ రెడ్డి :: నేమ్ బోర్డు ఇదే...

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (19:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని, బానిసత్వపు సంకెళ్లు బద్ధలయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. "తెలంగాణాలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్ధలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల ముఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట" అంటూ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర కొత్త కేబినెట్ తొలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు, సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నేమ్ బోర్డు ఫోటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments