అర్థరాత్రి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సుదీర్ఘ చర్చ వద్దన్న స్పీకర్

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (12:05 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం అర్థరాత్రి వరకు జరిగాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 1.30 గంటల తర్వాత కూడా కొనసాగాయి. విద్యుత్ అంశంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 
 
10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టలేదని ధ్వజమెత్తారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100కు పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనితో పాటు పలు అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చలు సాగాయి. 
 
ఇకపోతే.. మంగళవారం శాసన సభ ప్రారంభమైంది. సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments