Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజా భవన్‌లోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

bhatti vikramarka
, గురువారం, 14 డిశెంబరు 2023 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లోకి అడుగుపెట్టారు. ఆయన గురువారం ఉదయం కుటుంబ సమేతంగా ఈ భవనంలోకి విచ్చేశారు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌గా ఉన్న ఈ భవనం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించారు. 
 
దీంతో ఆయన గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి భవనంలోకి అడుగుపెట్టారు. ముందుగా అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్ళారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
కామారెడ్డిలోని షాపింగ్ మాల్‌‍లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం  
 
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లింది. కామారెడ్డి పట్టణంలో ఉండే అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇందులోని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై ప్రాణభీతితో పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జేసీబీ సాయంతో మాల్ షట్టర్లు తొలగించారు. 
 
మంటలను ఆర్పే పనులు అర్థరాత్రి నుంచి చేపట్టగా గురువారం ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలు ఆటంకంగా మారింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైందని షాపింగ్ మాల్ నిర్వహాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాట తీస్తామంటూ... డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక