Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో కార్తి ఏమి చేశాడు.. రివ్యూ రిపోర్ట్

Japan Cinema Review
, శుక్రవారం, 10 నవంబరు 2023 (12:30 IST)
Japan Cinema Review
హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 10న అనగా నేడు విడుద చేసింది.
 
కథలోకి వెళ్తే... 
సముద్రతీరాన ఓ పురిగుడిసెలో తల్లితో జీవించే జపాన్ (కార్తి) చదువు సంధ్యలు లేకుండా ఆవారగా తిరిగే వాడు. చిన్న తనంలోనే చేసిన దొంగతనం అతన్ని పెద్ద దొంగగా మారుస్తుంది. ఆ సొమ్ముతో సినిమా హీరో అయి పేరు తెచ్చు కుంటాడు. అలాంటి జపాన్ 200 కోట్ల దోపిడీలో దోషిగా చూపిస్తూ పోలీస్‌లు టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ కూడా జోక్యం చేసుకుని జపాన్‌ను చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష.
ఇది దొంగ పోలీస్ కథ. దొంగ పోలీస్‌లు కళ్లుగప్పి ఏ విధంగా ఎస్కేప్ అవుతాదనేది ఎంటర్‌టైన్మెంట్‌గా చూపించారు. కార్తి మేనరిజమ్స్, మాట తీరు కొత్తగా ఉంది. అను కేవలం సినిమా హీరోయిన్‌గా చేసింది. మిగిలిన అంతా తమిళ నటులే. 
దొంగ డబ్బు తెచ్చిన హోదాతో అమ్మాయిలతో ఎంజాయ్ మెంట్ చివరికి ఏమి మిగిలిస్తుంది అనేది సందేశంగా చూపాడు.
 
పాటలు పెద్దగా లేవు. ఐటెం సాంగ్ ఉంది. సీరియస్ కథ వినోదంతో తీశాడు. ఈ సినిమా రేవేర్స్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. కేవలం టైం పాస్ మూవీ. తెలుగు ఆడియెన్స్‌కు కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది.

జపాన్.. అంటే..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నిలదొక్కుకుని ఎలా డెవలప్ అయిందో నువ్వు అంతలా జీవితంలో ఎదగాలని.. కార్తికి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 7: ప్రియాంకను హత్తుకుని ముద్దుల వర్షం.. ఎవరు?