Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో కార్తి ఓ క్వశ్చన్ బ్యాంక్ : జపాన్ దర్శకుడు రాజు మురుగన్

Karthi, Raju Murugan
, గురువారం, 9 నవంబరు 2023 (16:56 IST)
Karthi, Raju Murugan
హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ కు రాబోతున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మురుగన్ పలు విషయాలు పంచుకున్నారు.
 
- కార్తి గారు సినిమా మేకింగ్ సమయంలో సలహాలు, కొన్ని ఆలోచనలు పంచుకున్నారు. ఆయన సపోర్ట్ తోనే ఈ సినిమా ఇంత పెద్దగా మారింది. కథ, కథనాల చెప్పినప్పుడు, సినిమా టేకింగ్ సమయంలో కార్తి గారు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారో అని మనం కూడా ఆశ్చర్యపోతాం. అతని ప్రశ్నలు మనలో చాలా  కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. కార్తి గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.
 
- ఎస్. రవి వర్మన్ సర్ భారతదేశంలోని ప్రముఖ కెమెరామెన్‌లలో ఒకరు. అతను, కార్తీ సర్ చాలా బాగా సింక్ అయ్యారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. సినిమాకు ఆయన అందించిన సహకారం అద్భుతం. జపాన్ కథ చెప్పడానికి ఇంటర్నేషనల్ మేకింగ్ కావాలి. ఇందుకోసం రవి వర్మన్ గారిని తీసుకున్నాము. తన పనితీరుతో సినిమా క్వాలిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.  
ఎంతగానో సహకరించారు. అదే విధంగా, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్.. టెక్నికల్ టీం అంతా ఎంతగానో సపోర్ట్ చేశారు.  
 
- బేసిగ్గా నేను రచయితని. గేయ రచయిత శ్రీ యుగ భారతి నాకు బ్రదర్ లాంటి వారు. నేను సినిమాల కోసం చెన్నైకి వచ్చిన తొలినాళ్ళలో అతని రూమ్ లోనే ఉన్నాను. నేను అతని నుండి స్ఫూర్తి పొందాను. దర్శకుడు కుమారరాజ త్యాగరాజు “మోడరన్ లవ్ చెన్నై’ సిరిస్ కి నిర్మాత. తను నాకు  మంచి స్నేహితుడు. ఒక ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించమని నన్ను అడిగారు. ఇది లవ్ బేస్డ్ థీమ్ కావడంతో డైరెక్టర్ చేయడానికి  అంగీకరించాను. లవ్ స్టోరీలు, లవ్ థీమ్ సినిమాలను డైరెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను.
 
- పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. ముందుగా మనకు నచ్చిన సినిమాలు తీస్తే, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతాను. నా సినిమాలన్నీ ప్యాషన్‌తో చేసినవే. జపాన్ మమ్మల్ని  నెక్స్ట్ లెవల్  తీసుకువెళుతుందని నమ్ముతున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోటీ ఉన్నా సినిమా బాగుందంటే కచ్చితంగా చూస్తారు హీరో దినేష్ తేజ్