Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపాన్ లో టచ్చింగ్ టచ్చింగ్..పాటను ఇంద్రావతి చౌహాన్ తో కలసి పాడిన కార్తి

Advertiesment
Karthi,  Anu Emmanuel
, బుధవారం, 25 అక్టోబరు 2023 (15:49 IST)
Karthi, Anu Emmanuel
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం 'జపాన్‌' చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.  అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ విడుదల చేయనుంది.

ఇటివలే విడుదలైన జపాన్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ జపాన్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. జపాన్ ఫస్ట్ సింగిల్ టచ్చింగ్ టచ్చింగ్ పాటని విడుదల చేశారు. జివి ప్రకాష్ కుమార్ ఈ పాటని పెప్పీ అండ్ మాసీ నెంబర్ గా కంపోజ్ చేశారు.

హీరో కార్తి, సింగర్ ఇంద్రావతి చౌహాన్ తో కలసి స్వయంగా ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ మరో ఆకర్షణగా నిలిచింది. పాటలో కార్తి, అను ఇమ్మాన్యుయేల్ ల కెమిస్ట్రీ కలర్ ఫుల్ గా వుంది.  

జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్. ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్‌ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రానికి ఎస్ రవి వర్మన్  డీవోపీ పని చేస్తుండగా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
జపాన్ 'దీపావళి'కి గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

8 ఏళ్లు అర్థాకలికి 40 ఏళ్ల కెరీర్ దక్కింది : నరకాసుర చరణ్ రాజ్