Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (09:03 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కల్తీ ఆహారాన్ని ఆరగించిన 70 మంది రోగులు అస్వస్థకు లోనయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 67 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
ఈ సంఘటనపై ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
మీ అందరి బాగోతాలు వెల్లడిస్తానంటున్న రాజాసింగ్ 
 
తెలంగాణ, హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ సీనియర్ నేత రాజసింగ్ పార్టీ పెద్దలకు ఓ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. పైగా, సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించారు. తనకు నోటీసులు పంపాలన్న ఆలోచనే ఏమాత్రం భావ్యం కాదని, పైగా, ఎవరి వల్ల పార్టీకి నష్టమో ప్రజల ముందు ఉంచుతానని ఆయన వెల్లడించారు. 
 
తనకు పార్టీ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. ధైర్యముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కొందరు అసలు స్వరూపాలను బయటపెడతానని, అందరి జాతకాలు ప్రజలు ముందు ఉంచుతానని హెచ్చరించారు. 
 
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి  దూరంగా ఉంటున్నారనే ఆరోపణలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణాలతో రాజాసింగ్‌‍కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన పై విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments