Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (14:28 IST)
అత్యంత ప్రముఖ పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అనేక మంది నగర వాసులు తమతమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతుంటారు. ఇలాంటి వారికోసం, రైళ్లలో రద్దీని నివారించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే 52 అదనపు రైళ్లను నడుపనుంది. 
 
నగరంలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన విడుదల చేసింది.
 
వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...
 
ప్రపంచంలోని కొందరు వ్యక్తులు అసాధ్యమనుకున్నపనిని సుసాధ్యం చేస్తుంటారు. అలాంటి పనులు చేసేవారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తమ పేరును సంపాదించుకుంటుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అనే వ్యక్తి నాలుకతో టేబుల్ ఫ్యాన్ రెక్కలను ఆపేశాడు. అదీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నిలిపాడు. ఈ సాహసోపేత పనితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు. 
 
సూర్యాపేట వాసి క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించాడు. మనోడి ఈ సాహసోపేత ప్రదర్శన తాలూకు వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. వీడియోలో వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతి కుమార్ తన నాలుకతో ఆపడం కనిపించింది. కొన్ని ఫ్యాన్లను ఆపిన తర్వాత అతని నాలుకకు గాయమై రక్తం కారడం కూడా వీడియోలో ఉంది.
 
అయినా అతడు వెనుకడుగు వేయకుండా అలాగే ముందుకు సాగాడు. చివరికి ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి వరల్డ్ రికార్డు సృష్టించాడు. దీంతో క్రాంతి కుమార్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. '57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లు క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో నాలుకను ఉపయోగించి ఆపేశారు' అని గిన్నిస్ బుక్ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments