గోవును "మదర్ ఆఫ్ ద నేషన్"గా ప్రకటించాలి: అవిముక్తేశ్వరానంద్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (23:14 IST)
గోవును "మదర్ ఆఫ్ ద నేషన్"గా ప్రకటించడంలో భాగంగా 35 రోజుల పాటు సాగే "గౌ ధ్వజ స్థాపన భారత్ యాత్ర" బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ నేతృత్వంలోని యాత్ర సెప్టెంబర్ 22న అయోధ్యలో ప్రారంభమై అక్టోబర్ 26 వరకు అన్ని రాష్ట్రాల రాజధానులను తాకింది.

ఈ సందర్భంగా హైదరాబాదులో శంకరాచార్య ఆవు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యాత్రికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "భారత నేల నుండి గోహత్య పూర్తిగా తొలగించి, గోవును జాతీయ తల్లిగా ప్రకటించడానికి నేను ప్రయాణం చేస్తున్నాను" అని అన్నారు.
 
మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే గోవును రాష్ట్ర మాతగా ప్రకటించి, కేబినెట్ ప్రతిపాదన కాపీని శంకరాచార్య పాదాల వద్ద ఉంచడంతో ఈ చారిత్రాత్మక ప్రయాణం గొప్ప విజయాన్ని సాధించింది. భక్తులనుద్దేశించి శంకరాచార్య మాట్లాడుతూ.. గంగ, గోవుల కృపను కోరే గోపాలమణి సారథ్యంలోని ఉద్యమం పవిత్రమైనదన్నారు. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments