Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. ఏ మార్గంలో అంటే...

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (09:05 IST)
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇపుడు మరో వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. ఈ మూడో వందే భారత్ రైలును సికింద్రాబాద్ - పూణె ప్రాంతాల మధ్య నడుపనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం, రెండో వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రాంతాల మధ్య నడుపుతున్నారు. మూడో రైలు సికింద్రాబాద్ - పూణెల మధ్య నడిపేలా చర్యలు తీసుకున్నారు. 
 
కాగా, భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల మంచి డిమాండ్ ఉండటంతో రైల్వే శాఖ కూడా అనేక మార్గాల్లో ఈ తరహా రైళ్లను నడిపేందుకు అమితాసక్తిని చూపుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఒకే రోజున పది మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపనున్నరు. వీటిలో ఒకటి సికింద్రాబాద్ - పూణె వందే భారత్ రైలు కూడా ఉంది. అయితే, ఇది వందే భారత్ రైలా లేక వందే సాధారణ్  లేదా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలా అన్నది తెలియాల్సివుంది. 
 
చైనా వెల్లుల్లితో దేశ భద్రతకు ముప్పా.. ఎలా? 
 
చైనా నుంచి దిగుమతి చేసుకునే వెల్లుల్లితో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందా? ఈ మాట వినేందుకు కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ రిక్ స్కాట్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా వెల్లుల్లితో తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు పొంచివుందని ఆయన హెచ్చరిక చేస్తున్నారు. పైగా, చైనా వెల్లుల్లిని వినియోగించడం దేశ ప్రలకు హానికరమని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల చైనా వెల్లుల్లి దిగుమతులపై దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. 
 
వెల్లుల్లి పెంపకంలో చైనా రైతులు అపరిశుభ్ర విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. మురుగునీటిని ఎరువుగా ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా వెల్లుల్లితో పాటు చిల్డ్ గార్లిక్ ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అగ్రగామి కాగా అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. వెల్లుల్లి విషయంలో కొన్ని ఏళ్లుగా అమెరికా, చైనా మధ్య విభేదాలు నెలకొన్నాయి. చైనా అతి తక్కువ ధరలకు వెల్లుల్లిని తీసుకొచ్చి తమ దేశంలో కుమ్మరిస్తోందంటూ అమెరికా గతంలో ఆరోపించింది. దీనికి అడ్డుకట్టు వేసేందుకు చైనా దిగుమతులపై రకరకాల చార్జీలు కూడా బాదింది.
 
నిపుణుల ప్రకారం, చైనా వెల్లుల్లి దేశీ రకాల కంటే పెద్దవిగా, తెల్లగా ఉంటాయి. అయితే, చైనా వెల్లుల్లిపై అమెరికాలో ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరమైన లోహాలు, ఇతర విషతుల్యాలతో కలుషితమైన మురుగునీటిని ఎరువుగా వాడి వెల్లుల్లి పెంచుతారన్న ఆరోపణలు ఉన్నాయి. లోహాల విషయం అటుంచితే, చెట్లకు మురుగునీరు ఎరువుగా వాడటంలో తప్పేమీ లేదని నిపుణులు చెబుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments